
International | బిల్లనాయక్ తండ యువకుడి అరుదైన ఘనత..
International | బిల్లనాయక్ తండ యువకుడి అరుదైన ఘనత..
- క్యాన్సర్‌పై పరిశోధనతో డాక్టర్ మాలోతు రామ్మోహన్ శాస్త్రీయ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు
International | నల్లబెల్లి, ప్రతినిధి : తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుండి అంతర్జాతీయ(International) స్థాయికి చేరే ప్రతిభావంతులు ఎంతమంది ఉన్నారనే పాఠాన్ని మళ్లీ ఒకసారి బిల్లనాయక్ తండ యువకుడు డాక్టర్ మాలోతు రామ్మోహన్ నిరూపించారు. మారుమూల తండలోని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన, కష్టాన్ని మాత్రమే మూలధనంగా చేసుకొని రసాయన శాస్త్ర రంగంలో అపూర్వ విజయాన్ని అందుకున్నారు.
గ్రామీణ మూలాల నుండి శాస్త్రీయ(scientific) మైలురాయికి నల్లబెల్లి మండలం బిల్లా నాయక్ తండ ఆయన పుట్టిపెరిగిన ఊరు. కుటుంబ పరిస్థితులు సాధారణమైనప్పటికీ, విద్యాభ్యాసంపై ఆయనకు ఉన్న తపన ఎప్పుడూ తగ్గలేదు. స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తిచేసి, ఆపై ఉన్నత విద్యకు నర్సంపేట, హైదరాబాద్‌లలో ప్రగతి సాధించారు.
ఈ ప్రయాణంలో అనేక అడ్డంకులు ఎదురైనా, పట్టుదలతో ముందుకు సాగారు. క్యాన్సర్‌పై కొత్త దారులు ఉస్మానియా(Osmania) విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ గంగాధర్ థలారి మార్గదర్శకత్వంలో రామ్మోహన్ చేసిన పరిశోధన శాస్త్రీయ వర్గాల్లో విశేషంగా ప్రశంసలు అందుకుంటోంది.
ఆయన రూపొందించిన “థయాజోల్–టెట్రాహైడ్రోపైరిడిన్, నికోటినమైడ్, థయాజోల్–టెట్రాహైడ్రోపైరిడిన్–పైరిడిన్(Thiazole–Tetrahydropyridine–Pyridine) అనలాగ్‌లు” క్యాన్సర్ నిరోధక ఏజెంట్లుగా పనిచేసే సామర్థ్యాన్ని విశ్లేషించే దిశగా కొత్త అధ్యాయం తెరిచాయి. ఈ ప్రయోగాత్మక ఫలితాలు భవిష్యత్‌లో ఔషధ పరిశోధనలకు మార్గదర్శకంగా ఉండే అవకాశముందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
కుటుంబం, గురువు, పట్టుదల – విజయం వెనుక మూలాలురామ్మోహన్ విజయంలో ఆయన కుటుంబం మదతు కీలకం. కుటుంబసభ్యుల ప్రోత్సాహం, గురువు మార్గనిర్దేశం, తన కృషి కలిసినపుడే ఈ స్థాయికి ఎదగగలిగానని ఆయన చెబుతున్నారు. “గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత కూడా ఉన్నత సాధన(High Achievement) చేయగలదనే నమ్మకాన్నే ఈ విజయం మరింత బలపరుస్తుంది” అని ఆయన అన్నారు.
యువతకు ప్రేరణగా మారిన రామ్మోహన్ఈ విజయంతో బిల్లనాయక్ తండలో ఆనందం నెలకొంది. స్థానికులు, ఉపాధ్యాయులు ఆయనపై గర్వం వ్యక్తం చేస్తున్నారు. ఒక మారుమూల గ్రామంలో పుట్టి, ప్రపంచ శాస్త్రీయ వేదికపై తెలుగు యువకుడు పేరు నిలపడమే ఈ తరం యువతకు ప్రేరణగా నిలుస్తోంది.
విద్యతో మార్పు సాధించవచ్చని రామ్మోహన్ చూపించిన ఈ ఉదాహరణ, గ్రామీణ ప్రాంత యవతలో కొత్త ఆశలు నింపుతోంది. అమ్మ నాన్న మలోత్ సరోజన, రతన్ సింగ్ అన్నయ్యలు రవీందర్ నాయక్, మహేందర్ నాయక్ అక్కయ్య కస్తూరీ బాయి, భార్య అపర్ణ యొక్క సహకారం తో PhD పూర్తి చేశాను.
