ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న తాహాసిల్దార్ ఆడే కమల్ సింగ్
కుంటాల, ఆంధ్రప్రభః ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో 440 మంది విద్యార్థులకు గాను 410 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు 30 మంది విద్యార్థులు గైరాజర్ అయినట్టు పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్డెంట్ ఎత్రాజ్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాన్ని తాసిల్దార్ ఆడే కమల్ సింగ్ స్పెషల్ స్కాడ్ శంకర్ వేరువేరుగా పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు.
మాస్ కాపీ జరగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్ష జరుగుతున్న గదుల్లోని ఆయన క్షుణంగా పరిశీలన చేసి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉంటుందని తాసిల్దార్ పేర్కొన్నారు. ఎవరిని లోనికి అనుమతించకూడదని పరీక్ష కేంద్రానికి విద్యార్థులు అరగంట ముందుగానే రావాలని ఆయన తెలిపారు. కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కుంటాల ఎస్సై ఎం అజయ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
