ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల వేగవంతం చేయండి..

ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల వేగవంతం చేయండి..

ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలిస్తున్న అధికారులు

మక్తల్ , ఆంధ్రప్రభః తెలంగాణ రాష్ట్ర పాడి పశుసంవర్ధక క్రీడా మత్స్య డైరీ శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాలతో మక్తల్ పట్టణ శివారులోని గోలపల్లి క్రాస్ సమీపంలో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు వేగవంతానికి అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా యంగ్ ఇండియా ఇంజనీర్లతో పాటు స్థానిక అధికారులు, నాయకులు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించి నిర్మాణ పనుల వేగవంతానికి తగు సూచనలు అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారని, అందులో భాగంగా మంత్రి వాకిటి శ్రీహరి సూచనల మేరకు పట్టణ శివారులో దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో 2000 మందికి పైగా విద్యార్థులతో నూతనంగా నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు వేగవంతానికి కీలక అడుగులు పడుతున్నాయి.

పనులు ప్రారంభించి అతి త్వరలో నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను మఖ్తల్ నియోజవర్గానికి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి వాకిటి శ్రీహరి ధృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. దీంతోపాటు నియోజక వర్గంలో వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను సైతం వేగవంతం చేసి, గతంలో ఎన్నడూ లేనంతగా నియోజవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మంత్రి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని స్థానిక నాయకులు తెలిపారు.

Leave a Reply