Integrated | 5జీ స్మార్ట్ ఫోన్ల పంపిణీ..

Integrated | 5జీ స్మార్ట్ ఫోన్ల పంపిణీ..
Integrated | నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ పట్టణం కాకాని నగర్‌లో బుధవారం ఇంటిగ్రేటెడ్(Integrated) చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు 5జీ స్మార్ట్ ఫోన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలు అధికారులతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ స్మార్ట్ ఫోన్ల(smart phones)ను అందిస్తున్నదని తెలిపారు. ఈ ఫోన్లలో పోషణ ట్రాకర్ బాల సంజీవిని యాప్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ వివరాలు, సేవల అమలు స్థితిని అంగన్వాడీ టీచర్లు నేరుగా నమోదు చేయవచ్చని చెప్పారు.
అంగన్వాడీ కేంద్రాలలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం డిజిటల్(digital)గా నమోదు కావడం వల్ల పని తీరులో నాణ్యత పెరగడంతో పాటు ప్రభుత్వానికి తక్షణ సమాచారం అందుతుందని, దీని ద్వారా సేవలలో జవాబుదారీతనం మరింత మెరుగు అవుతుందని ఆమె వివరించారు. బాలల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని(technology) ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ లక్ష్మీ భార్గవి, శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
