Inspection | వాహనాల తనిఖీ…
Inspection | మహా ముత్తారం, ఆంధ్రప్రభ : మండలంలోని యామనపల్లి నిమ్మగూడెం మధ్యల గల ప్రధాన రహదారి వద్ద ఈ రోజు మహా ముత్తారం స్టేషన్ ఆఫీసర్ మహేందర్ కుమార్(Mahender Kumar) సూచనల మేరకు ఎస్సై జక్కుల మహేష్ తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు.
వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. వాహన పత్రాలను పరిశీలించి అనుమానితులతో మాట్లాడి వదిలేశారు. వాహనం కలిగిన ప్రతి ఒక్కరూ వాహన పత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్(Driving License) కలిగి ఉండాలని వాహనదారులకు సూచించారు. ఈ తనిఖీ(Inspection)ల్లో పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.

