Innovation | డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

Innovation | ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : నూతన సంవత్సర సందర్భంగ జిల్లా జేఏసీ చైర్మన్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ వెట్రీసెల్విని కలిసి శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడని కలిసి వారి చేతుల మీదగా రెవెన్యూ క్యాలెండర్‌ను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావుని మర్యాపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
కార్యక్రమములో జిల్లా కార్యదర్శి ఏ.ప్రమోద్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ జి. విజయకుమార్ రాజు, వైస్ ప్రెసిడెంట్లు కె.చల్లాన్ దొర, కె.రవి చంద్రరావు, పి.మాధవి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సీహెచ్. యశ్వంత్, జాయింట్ సెక్రెటరీ నాజీమ బేగం, కలెక్టరేట్ యూనిట్ ప్రెసిడెంట్ నాయక్, సెక్రెటరీ బాలరామ కృష్ణ, డివిజన్ సెక్రెటరీ కృష్ణ స్వామి, సెక్రెటరీ శివ పాల్గొన్నారు.

