హైదరాబాద్: లండన్ పర్యటనలో ఉన్న ఏపీ కి చెందిన ఎమ్మెల్యే సుజనా చౌదరి ఒక సూపర్ మార్కెట్‌లో ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. .ఈ. ఘటనలో ఆయన కుడి భుజానికి బలమైన గాయం అయ్యింది.. ఎముక విరిగినట్లు సమాచారందీంతో.. లండన్‌లో ప్రాథమిక వైద్యం తీసుకున్న ఆయన్ను మెరుగైన వైద్య సేవల కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించారు.. సర్జరీ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు సుజనా చౌదరి..
లండన్ నుంచి తెల్లవారుజామున 3 గంటల సమయంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సుజనా చౌదరిని.. బేగంపేట్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టుగా చెబుతున్నారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది..