అటవీ శాఖ అధికారులకు సమాచారం…

పుట్లూరు, (ఆంధ్రప్రభ) : అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలోని ఆదర్శ్ పాఠశాలలో అరుదైన జంతువు… పునుగు పిల్లి ప్ర‌త్య‌క్షమైంది. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఓబుల్ రెడ్డి రూముకు జాయింట్ గా ఉన్న బాత్రూంలో వింత జంతువు కనపడడంతో వెంటనే ఆయన అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

స్పందించిన అటవీ శాఖ అధికారులు వెంటనే పాఠశాలలకు చేరుకుని పునుగు పిల్లిని పట్టుకున్నారు. ఇది అరుదైన జంతువులలో ఒకటి అని, ఈ జాతి ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదం ఉందని వారు తెలిపారు. అయితే ఈ పునుగుపిల్లి ఇక్కడికి ఎలా వచ్చిందో అని గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. అటవీ అధికారులు పిల్లిని పట్టుకుని సమీపంలోని అడవుల్లో వదిలేశారు.

Leave a Reply