Indravelli | సర్టిఫికెట్ల పంపిణి..

Indravelli | సర్టిఫికెట్ల పంపిణి..
- గృహ జ్యోతి కు 5వేల 115 లబ్ధిదారులు
- ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో సర్టిఫికెట్ల పంపిణి
Indravelli | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని 29 గ్రామపంచాయతీలలో 5వేల ఒక వంద 15 మంది లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలను సారం ఉచిత విద్యుత్తు పొందుతున్న వారికి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లను అందజేశారు. శుక్రవారం మండల కేంద్రానికి చెందిన విద్యుత్ శాఖ అధికారి జాదవ్ రోహిదాస్ ఆధ్వర్యంలో ఈ సర్టిఫికెట్ల పంపిణీ చేశారు.
తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబీకులకు ఈ సర్టిఫికెట్ల పంపిణీ చేసినట్లు విలేకరులకు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు ప్రభుత్వము 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ప్రకటించడంతో ప్రతి నెల వీరికి జీరో బిల్ వస్తు ఉచిత కరెంటును ఉపయోగిస్తున్నందులకు సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు ఎల్ ఐ రమేష్, సిబ్బంది ఆఫ్రిది, ఎస్కే షరీఫ్, ఆదం, తదితర తదితర విద్యుత్తు సిబ్బందులు పాల్గొన్నారు.
