ఇంద్రకీలాద్రి కొండకు.. నిప్పు

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన ఇంద్రకీలాద్రి కొండకు శనివారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది.ప్రతి శనివారం స్వామి వారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు.శనివారం రోజునే సంఘటన కావడం వారం రోజుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కానుండడంతో ఈ సంఘటనను చూసిన భక్తులు అయోమయానికి గురవుతున్నారు.పరిసర ప్రాంత రైతులు తమ పంట పొలాలు,పశు సంపదకు మంటలు వ్యాపిస్తాయని గుట్ట చుట్టూ మొత్తం వ్యాపించక ముందే అగ్నిమాపక శాఖ మరియు అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి మంటలను అర్పాలని,నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణాన్ని కాపాడాలని మండల ప్రజలు,రైతులు,భక్తులు కోరుతున్నారు.

Leave a Reply