Indrakiladri | స్టేట్ బ్యాంకులో దుర్గమ్మ బంగారం డిపాజిట్

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే రెండు అతిపెద్ద దేవాలయమైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ప్రతి ఏటా భక్తులు ( devotees ,) అందించే విరాళాలతో (donation ) అమ్మవారి క్యాష్ డిపాజిట్ లతోపాటు, బంగారం (gold) డిపాజిట్ కూడా పెరుగుతూ వస్తుంది. అన్ని దేవాలయాల్లోనీ బంగారు నిల్వలను దగ్గరలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం సర్వసాధారణం. గోల్డ్ మానిటైజేషన్ స్కీం ద్వారా బ్యాంకులు ఆలయాల నుండి బంగారాన్ని డిపాజిట్ రూపంలో స్వీకరించడంతోపాటు వీటికి వడ్డీని సైతం ప్రతి ఏటా క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉంటాయి.

గోల్డ్ డిపాజిట్లకు సంబంధించి 0.60 శాతం వడ్డీని బ్యాంకులు చెల్లిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం కనకదుర్గమ్మ వారికి భక్తులు మోక్కుల రూపంలో చెల్లించుకున్న బంగారాన్ని అధికారులు స్థానిక స్టేట్ బ్యాంకులో (SBI ) డిపాజిట్ చేశారు.

సుమారు రూ 27 కోట్ల రూపాయల విలువైన 29 కేజీల, 510 గ్రాముల బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేశారు. భక్తులు కానుకల రూపంలో అందిస్తున్న బంగారం చాలాకాలంగా స్ట్రాంగ్ రూమ్ లోనే భద్రపరిచి ఉంటూ వస్తుంది. గడిచిన కొంతకాలంగా ఈవోలు మారుతున్నప్పటికీ బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ముందుకు రాలేదు. ఇటీవల బాధ్యతలు స్వీకరించి. కార్యనిర్వహణ అధికారి, డిప్యూటీ కలెక్టర్ శీనా నాయక్ ఆలయంలో భద్రపరిచి ఉన్న బంగారు ఆభరణాల విలువను లెక్కించారు.

విజయవాడలో సోమవారం మార్కెట్ రేటు ప్రకారం 22 క్యారెట్ గోల్డ్ రేటు గ్రామ్ కు రూ 9010 ఉండగా అప్పగించిన బంగారం విలువ రూ 26 కోట్ల, 58 లక్షల 85 వేలు ఉండునట్లు అధికారులు అంచనా వేశారు. ఆలయ అధికారులు బృందంగా ఏర్పడి ఈ బంగారాన్ని ఎస్బిఐ అధికారులకు గ్రూప్ పూర్తి రక్షణ మధ్య అందజేశారు.

ఈ కమిటీలో జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పల్లం రాజు, దావాదేశా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ పర్యవేక్షకులు సుబ్రహ్మణ్యం ఉండగా దేవస్థానం కమిటీలు ఏఈఓ లు పి చంద్రశేఖర్, ఎం రమేష్ బాబు, ఎంఎస్ఎల్ వాసు, దేవస్థానం గోల్డ్ అప్రైజర్ డి షమ్మీ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో ముగ్గురు కానిస్టేబుల్ సమక్షంలో గాంధీనగర్ ఎస్బిఐ బ్రాంచ్ అధికారులకు ఈ బంగారాన్ని సురక్షితంగా అందజేశారు.

ఈ పరిస్థితుల్లో అమ్మవారికి ప్రతి ఏట నగదు, బంగారు నిల్వలకు సంబంధించి వడ్డీ రూపంలో ఆదనపు ఆదాయం సమకూరనుంది.

Leave a Reply