Indrakiladri | అమ్మా.. సల్లంగా చూడు..

Indrakiladri | అమ్మా.. సల్లంగా చూడు..
- ఇంద్రకీలాద్రిపై వైభవంగా సంకటహర చతుర్థి పూజలు
Indrakiladri | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయంలో ఈ రోజు సంకటహర చతుర్థి(Sankatahara Chaturthi)ని పురస్కరించుకుని పాత యాగశాల వద్ద ఆలయ స్థానాచార్య వి.శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చక శంకర శాండిల్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే సీనానాయక్ పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున గణేష్ మహారాజ్కి గణపతి హోమం(Ganapati Homam), ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా సామగ్రితో ఆరాధనలు చేసి, స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు.

దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించారు. శ్రీ వినాయక స్వామికి విశేష పూజలు చేసి, భక్తులకు అనుగ్రహాశీస్సులు అందించారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని భక్తులు లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించి, విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు.
