ఇందిరమ్మ సేవలు చిరస్మరణీయం

మెదక్, ఆంధ్ర‌ప్ర‌భ : దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భారత దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గూడూరి ఆంజనేయులు గౌడ్ స్పష్టం చేశారు. ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు ఇందిరమ్మ వర్ధంతి సంద‌ర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ సామాజిక, రాజకీయ,సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో రాణించిన ఇందిరా గాంధీ భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. ఆమె స్ఫూర్తి తో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ గూడూరి కృష్ణ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంగ మోహన్ గౌడ్, బొజ్జ పవన్, శంకర్ గౌడ్, హరిత నర్సింగ్ రావు, జి.జ్యోతి, కృష్ణ, గాడి రమేష్, స్వరూప, సుఫీ తదితరులు పాల్గొన్నారు.

క‌మ్మ‌ర్‌ప‌ల్లిలో…

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సంద‌ర్భంగా కమ్మర్ పల్లి మండలం లోని ఉప్లూర్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి మాట్లాడుతూ గరిబీ హఠావో నినాదంతో దేశంలోని పేదల ఆకలి తీర్చిన ఘనత ఇందిరా గాంధీకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, సుంకేట శ్రీనివాస్, సళ్లూరి గణేష్ గౌడ్, సంపంగి నాగరాజు, నల్ల సాయికుమార్ గుప్తా, శివశారం గణేష్, శివసారం నరేష్, రంజిత్, శైలెందర్, జగదీష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply