Indira | ఘనంగా జయంతి..

Indira | ఘనంగా జయంతి..

Indira, మునుగోడు, ఆంధ్రప్రభ : దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ (Indira Gandhi) జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఇందిరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరవనిత, సంక్షోభాలను సవాళ్లను స్వీకరించి గెలిచిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ద్వారానే దేశాభివృద్ధి,సమాజ ప్రగతి సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భీమనపల్లి సైదులు, మిర్యాల వెంకటేశ్వర్లు, మాధగోని రాజేష్ గౌడ్, తాటికొండ సైదులు, పాల్వాయి జితేందర్ రెడ్డి, నకరికంటి యాదయ్య,పందుల నరసింహ, పందుల భాస్కర్, కుంభం చెన్నారెడ్డి, జంగిలి నాగరాజు, దండు లింగస్వామి, జాల మణి, బోయపర్తి ప్రసాద్, దుబ్బ రవి, బొందు రవి, సింగం గిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply