- పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు
- ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
INDIRA | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భారత దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ (Indira Gandhi) ఎనలేని సేవలు అందించారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కొనియాడారు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ (Congress party) కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందిరా చిత్రపటానికి ఎమ్మెల్యే పూల మాలలేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు నిర్మించి, భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మగా నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు. ఉక్కు మహిళా ఇందిరమ్మ పేద ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భూషణవేన సురేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దొడ్డుపల్లి జగదీష్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

