CELEBRATION | ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
CELEBRATION | మేడ్చల్, (ఆంధ్రప్రభ): స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా మేడ్చల్ మున్సిపల్ (Municipal) పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ…. బ్యాంకులను జాతీయం చేసిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ అని తెలియజేశారు.
మహిళా శక్తికి మార్గదర్శిగా నిలిచిన మహా నాయకురాలు, ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ (Market) కమిటీ డైరెక్టర్ రేగు రాజు కురుమ, మేడ్చల్ నియోజకవర్గ ఏ బ్లాక్ ఎస్ సి సెల్ అధ్యక్షులు పానుగంటి మహేష్ కుమార్, మేడ్చల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు గౌడ్ ( Nagaraju Goud) మేడ్చల్ మున్సిపాలిటీ ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు గుండ శ్రీధర్ కురుమ, మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు గోమారం రమణా రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు కౌడే మహేష్ కురుమ, మర్రి, తదితరులు పాల్గొన్నారు.

