IndiGo Airlines | శంషాబాద్ ఎయిర్ పోర్టులో తీవ్ర ఉద్రిక్తత

IndiGo Airlines | శంషాబాద్ ఎయిర్ పోర్టులో తీవ్ర ఉద్రిక్తత

  • కొన‌సాగుతున్న ఇండిగో విమానాల ర‌ద్దు
  • అయ్య‌ప్ప మాలాధ‌ర‌ణ భ‌క్తుల ఆందోళ‌న‌

IndiGo Airlines | రంగారెడ్డి జిల్లా ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) విమానాల స‌ర్వీసుల‌ను రద్దు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మూడో రోజు కూడా సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలతో వరుసగా మూడో రోజూ పెద్ద సంఖ్యలో సర్వీసులు (IndiGo Airlines) నిలిచిపోయాయి.

ఈ రోజు మొత్తం 500కు పైగా విమానాలను ఇండిగో సంస్థ రద్దు చేసింది. దీంతో ఎయిర్‌పోర్టులో ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బోర్డింగ్‌ ప్రక్రియ ముగిసి 12 గంటలవుతున్నా తాము వెళ్లాల్సిన విమానానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో ప్ర‌యాణికులు ఆందోళనకు దిగుతున్నారు.

శంషాబాద్‌ విమానాశ్రయం(International Airport)లో అయ్యప్ప స్వాముల నిరసనతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. హైదరాబాద్‌ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటల పాటు ఆలస్యం కావడం, అలాగే ఎప్ప‌డు బ‌య‌లుదేరుతుందో అని తెలియ‌క‌పోవ‌డంతో అయ్య‌ప్ప భ‌క్తులు ఆందోళనకు దిగారు.

విమానం ఆలస్యం కారణంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటల పాటు ఆలస్యం కావడంతో స్వాములు నిరసనకు దిగారు. ఇండిగో విమానం నిన్న‌ సాయంత్రం హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉంది.

ఈ విమానంలో వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు(Ayyappa devotees) సాయంత్రమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, విమానం శుక్రవారం ఉదయానికి కూడా బయలుదేరాకపోవడంతో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. 12 గంటలుగా తాము విమానాశ్రయంలోనే ఉన్నట్టు తెలిపారు. విమానం గురించి తమకు సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply