IndiGo crisis | లాభాపేక్ష వల్లే ఇండిగో సంక్షోభం!
IndiGo crisis | ఆంధ్రప్రభ : చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఫలితం ఏముంటుంది అన్న చందాన ఉంది ఇండిగో సంక్షోభం(Indigo crisis)లో కేంద్ర విమానయాన శాఖ వైఖరి. ప్రస్తుతం ఇండిగో సంక్షోభం దేశీయ విమానరంగంలో(In aviation) పెద్ద చర్చకే తెరలేపింది. ఇండిగో వైఫల్యం ఎప్పటినుండో కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నా కేంద్ర ప్రభుత్వం, విమాన యాన శాఖ, తదితర సంబంధిత శాఖలు ఏం చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. నియంత్రించాల్సిన డైరెక్టర్ జనరల్, సివిల్ ఏవియేషన్( డీజీసీఏ) కళ్ళు మూసుకొని కూర్చుందా, పౌర విమానాయన శాఖ ప్రేక్షక పాత్ర పోషిస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానమే లేదు. ఎందుకీ నిర్లక్ష్యం, చివరికి విమాన ప్రయాణికు లను ఏం చేద్దాం అనుకుంటున్నారు.

