- ఆంతా ఆర్బీఐ దయే
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గడిచిన రెండు రోజుల్లో.. భారత షేర్ మార్కెట్ హాయిగా.. సాఫీగా సాగింది. ఇక దలాల్ మార్కెట్ లో దరహాసం కనిపించింది. ఆర్బీఐ కొత్త పాలసీతో పైనాన్షియల్ సంస్థలు ఒడ్డున పడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచికలు ఎగబాకాయి. లాభనష్టాలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి.
ఏది ఏమైనా.. మంగళవారం షేర్ మార్కెట్ లో ఎగుడు దిగుడు సూచికలు .. మదుపర్లను స్థిమిత పర్చాయి. ఈ సందర్భంగా ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్ వంటి పెద్ద కంపెనీల షేర్లలో భారీ కొనుగోళ్లు నమోదు అయ్యాయి.
మధ్యాహ్నం 2 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 462.15 పాయింట్లు ఎగసి 82,252.27 స్థాయికి చేరింది. ఇక ముగింపు దశకు చేరే సరికి అదనంగా 136.43 పాయింట్లు సరిపెట్టుకుని 81,926.75 పాయింట్లతో ముగిసింది. అదే సమయంలో, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 124.55 పాయింట్ల పెరిగిన దశలో 25,197.70 కు చేరింది. కడకు 30.65 పాయింట్లతో 25,108.30 పాయింట్లకు చేరింది.
అంతా ఆర్‌బీఐ దయ
ఆర్డీబై కొత్త రుణాల పాలసీ, సంస్కరణలు, క్యాపిటల్ మార్కెట్స్, పెద్ద కార్పొరేట్లకు రుణ సదుపాయం నిబంధనలు సడలించడంతో ఫైనాన్షియల్ సెక్టార్ 0.5% పెరిగింది. సెప్టెంబర్ తైమాసిక బస్ట్ లోన్ గ్రోత్ సెంటిమెంట్‌ను బూస్ట్ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్వాన్సులు 14% పెరిగాయి.
రూ. 15,512 కోట్లు పెట్టుబడితో – టాటా క్యాపిటల్, రూ. 11,607 కోట్లతో ఇండియా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మదుపర్ల దృష్టిని ఆకర్షించాయి. ఇక జపాన్ నిక్కెయి రికార్డ్ తారా స్థాయికి చేరటంతో విదేశీ మదుపర్లు భారత్ వైపు చూశారు. యూఎస్/ యూరోపియన్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గడంతో మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. .
లాభాల జడిలో ఖుషీఖుషీ
మార్కెట్‌లో కొన్ని కంపెనీల షేర్లు మంచి లాభాలను అందుకున్నాయి. వోడాఫోన్ ఐడియా 9% పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. భారతి ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ వంటి కంపెనీల షేర్లు సుమారుగా 1.9 శాతం వరకు పెరిగాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ – 2%, భారతి ఎయిర్‌టెల్ 1.5-2%, ఎచ్‌సీఎల్ టెక్నాలజీస్ – 1.26%, డివిస్ ల్యాబ్స్ – 5%, బజాజ్ హోల్డింగ్స్ – 3% లాభం నమోదు చేశాయి.