మహిళా అథ్లెట్ పై వేటు..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: భారత మహిళా అథ్లెట్ సమ్మీ కలిరామన్ (athlete Sammi Kaliraman) డోపీ (doping)గా తేలింది. గతేడాది నాడాకు చెందిన యాంటీ డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్ నిర్వహించిన డోప్ టెస్టులో ఆమె విఫలమైంది. ఆమె శాంపిల్ లో నిషేధిత క్లోమిఫెన్ పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో సమ్మీపై తాజాగా నాడా వేటు వేసింది. రెండేళ్లపాటు నిషేధం విధించింది. గతేడాది అక్టోబర్ 14 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. గతేడాది సమ్మీ ఫెడరేషన్ కప్ లో రజతం గెలిచింది.

2021లో అండర్- 20 వరల్డ్ చాంపియన్ షిప్ లో కాంస్యం గెలిచిన 4×400 మీటర్ల మిక్స్డ్ టీమ్ జట్టులో ఆమె సభ్యురాలు. అలాగే, లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ శ్రీ రాగ్ పై ఐదేళ్లు, రేష్మ దత్తప నాలుగేళ్లు బ్యాన్ విధించారు. అంతేకాకుండా, వెయిట్ లిఫ్టర్ సిమర్శ జీత్ కౌర్, బాక్సర్ రోహిత్, రెజ్లర్ అర్జు, కబడ్డీ ఆటగాడు మోహిత్ నందల్, రేసర్ అనిరుధ అరవింద్లు కూడా డోప్ టెస్టులో విఫ లమైనట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

Leave a Reply