Navy | భారత తీర రక్షక దళం ఆవిర్భావ దినోత్సవం.. మోడీ శుభాకాంక్షలు
- నేవీ దళం సేవలకు ప్రధాని మోదీ ప్రసంసలు
- సముద్ర తీర ప్రాంత భద్రతలో రక్షక దళం పాత్ర అమోఘం
న్యూ ఢిల్లీ – భారత తీర రక్షక దళం వారి 49వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా తీర ప్రాంత రక్షక దళం చేస్తున్న సేవలను తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రశంసించారు.. మన విశాలమైన తీరప్రాంతాన్ని రక్షించడంలో ధైర్యసాహసాలు, అంకితభావం, నిరంతరం జాగరూకత వ్యవహరించడంలో మీ పాత్ర ప్రశంసనీయం అంటూ పేర్కొన్నారు. సముద్ర భద్రత నుండి విపత్తు ప్రతిస్పందన వరకు, స్మగ్లింగ్ నిరోధక కార్యకలాపాల నుండి పర్యావరణ పరిరక్షణ వరకు భారత తీర రక్షక దళం చేస్తున్నఅద్వితీయమని అన్నారు.