IND vs SA | చెత్త ఫీల్డింగ్.. చేజారిన రెండో వ‌న్డే !

  • విశాఖ గ‌డ్డ‌పై తేల‌నున్న సిరీస్ ఫ‌లితం

టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన రెండో వన్డే మ్యాచ్ చివరి వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా జట్టు.. టీమిండియాపై ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను సఫారీ జట్టు 1-1తో సమం చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా విజయవంతంగా ఛేదించిన మూడో అత్యధిక లక్ష్యం ఇదే కావడం విశేషం.

మొదటి వన్డేలో రెండు జ‌ట్ల స్కోర్లు క‌లిపి 680కి పైగా పరుగులు నమోదవగా, ఈ మ్యాచ్ లో ఏకంగా 700కు పైగా పరుగులు వచ్చాయి. తొలి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా, చివరి వరకు పోరాడిన దక్షిణాఫ్రికా, ఈసారి పట్టుదలతో గెలిచింది.

మ‌రోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా మాత్రం చాలా చెత్తగా ఫీల్డింగ్ చేసింది… వచ్చిన సులువైన క్యాచ్‌లను వదిలేయడం, అనవసర పరుగులు సమర్పించుకోవడంతో దక్షిణాఫ్రికాకు విజయం దక్కింది.

టాస్ గెలిచిన టెంబా బావుమా భార‌త్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. రోహిత్ శర్మ (14), యశస్వి జైస్వాల్ (22) త్వరగా ఔటైన తర్వాత, విరాట్ కోహ్లీ (102), రుతురాజ్ గైక్వాడ్‌ల (105) స్టైలిష్ సెంచరీలతో ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి పటిష్టమైన పునాది వేశారు. అయితే, తొలి వన్డే మాదిరిగానే, సెటిల్ అయినా…… ఈ ఇద్దరు బ్యాటర్లు వెంట వెంటనే ఔటవడంతో స్కోరు వేగం మందగించింది.

ఇక ఛేజింగ్ లో సౌతాఫ్రికా ఓపెన‌ర్ ఐడెన్ మార్క‌ర్ (110) సెంచ‌రీతో చెల‌రేగాడు. కెప్టెన్ టెంబా బ‌వుమా (46), మాథ్యూ బ్రీట్జ్కే (68), డెవాల్డ్ బ్రెవిస్ (54) ప‌రుగులు సాధించారు. ఇక చివరికి తొలి మ్యాచ్‌లో చేయలేని పనిని ఈసారి కార్బిన్ బాష్ (29) పూర్తి చేయడంతో సఫారీలు విజయం సాదించింది. లాక్కున్నారు. దీంతో సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో వన్డే కోసం రెండు జట్లు శనివారం వైజాగ్ (విశాఖపట్నం)కు చేరుకోనున్నాయి.

Leave a Reply