India One Air |కుప్పకూలిన చార్టర్డ్ విమానం…

India One Air | కుప్పకూలిన చార్టర్డ్ విమానం…

India One Air | వెబ్‌డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : చార్టర్డ్ విమానం కుప్పకూలిన ఘటన ఈ రోజు ఒడిశాలోని రూర్కెలా ఎయిర్‌స్ట్రిప్ వద్ద చోటుచేసుకుంది. ఇండియా వన్ ఎయిర్ (IndiaOne Air) సంస్థకు చెందిన 9 సీటర్ చార్టర్డ్ విమానం రూర్కెలా ఎయిర్‌స్ట్రిప్ నుంచి భువనేశ్వర్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సుమారు 10 కిలోమీటర్ల దూరంలో విమానంలో తీవ్ర సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై, విమానాన్ని సమీపంలోని రఘునాథ్‌పాలి పరిధిలోని జల్దా (Jalda) ప్రాంతంలో ఉన్న ఒక ఖాళీ మైదానంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. విమానం రన్‌వే వరకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో చాకచక్యంగా మైదానంలో బెల్లీ ల్యాండింగ్ (Belly Landing) చేశారు. ఈ క్రమంలో విమానం వేగంగా భూమిని ఢీకొనడంతో కుప్పకూలింది. విమానంలో పైలట్, కో-పైలట్‌తో పాటు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

India One Air |

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రూర్కెలాలోని ఆసుపత్రి(hospital)కి తరలించారు. పైలట్(Pilot) సమయస్ఫూర్తితో జనావాసాలపై విమానం పడకుండా చూసుకోవడం వల్ల అతిపెద్ద ప్రమాదం తప్పిందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Leave a Reply