India, New Zealand | రేప‌టి నుంచే వ‌న్డే స‌మ‌రం

India, New Zealand | రేప‌టి నుంచే వ‌న్డే స‌మ‌రం

  • భార‌త్‌, న్యూజీలాండ్ ఢీ
  • తొలి మ్యాచ్ వడోదరలోని బీసీఏ (BCA) స్టేడియంలో..
  • మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ఆట ఆరంభం

వెబ్‌డెస్క్ (స్పోర్ట్స్‌), ఆంధ్ర‌ప్ర‌భ : భారత గడ్డపై టెస్టు సిరీస్‌లో చారిత్రక విజయాన్ని నమోదు చేసిన న్యూజిలాండ్ జట్టు.. కొత్త సంవ‌త్స‌రంలో వన్డే ఫార్మాట్‌లో టీమిండియాతో తలపడటానికి సిద్ధమైంది. రేప‌టి (జనవరి 11) నుంచి వడోదరలోని బీసీఏ (BCA) స్టేడియం వేదికగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది.

India, New Zealand | బ‌రిలోకి రోకో..

India

స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడటం కన్ఫర్మ్. ఓపెనింగ్ రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ దిగనుండగా.. వన్ డౌన్ విరాట్ కోహ్లీ కన్ఫర్మ్. ఇక నాలుగో స్థానంలో.. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో అర్ధ సెంచరీతో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్ కంబ్యాక్ ఇవ్వనున్నాడు. వికెట్ కీపర్‌గా కెఎల్ రాహుల్ స్టంప్స్ చూసుకోనున్నాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. దీంతో రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

India

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగుతాడు. ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదా నితీష్ కుమార్ రెడ్డి బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. సుందర్ ప్రస్తుత ఫామ్‌ను చూస్తే.. అతడికే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కేలా ఉంది. ఇక గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని చూసుకోనున్నారు. స్పిన్ విషయానికొస్తే.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చూసుకుంటారు.

India, New Zealand | భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ఇలా..

India

శుభ్‌మాన్ గిల్(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్

బెంచ్: యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్

కివీస్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది.
మొత్తం మ్యాచ్‌లు: 120
భారత్ విజయం: 62
న్యూజిలాండ్ విజయం: 50
ఫలితం తేలనివి: 7

CLICK HERE TO READనేటి నుంచే డబ్ల్యూపీఎల్‌ 4వ సీజన్‌

CLICK HERE TO READ MORE

Leave a Reply