Indhanpalle | ఆవును చంపిన పులి

Indhanpalle | ఆవును చంపిన పులి

యజమానికి నష్టపరిహారం చెల్లిస్తాం : అటవీ అధికారులు


Indhanpalle | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా (Mancherial district) కవ్వాల టైగర్ రిజర్వ్ జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని ఇందనపల్లి అడవుల్లో పులి (tiger) సంచరిస్తుంది. ఇందనపల్లి ఉత్తర అటవీ బీట్ లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆవును పెద్దపులి చంపినట్లు ఆనవాళ్లను అటవీ శాఖ అధికారులు బుధవారం మధ్యాహ్నం కనుగొన్నారు. ఆవు (cow) కలేబరాన్ని గుర్తించి పరిశీలించారు.

ఈ సందర్భంగా సాయంత్రం స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్ (FDO Rammohan), ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ (Lakshminarayana) మాట్లాడుతూ… ఇందనపల్లి అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అడవుల్లోకి ప్రజలు, పశువుల కాపర్లు వెళ్ళకూడదని వారు తెలిపారు. ఓ ఆవును పెద్దపులి చంపిందని తాము గుర్తించామని వారు చెప్పారు. పెద్దపులిని చంపడం కోసం కరెంటు వైర్లు, ఉచ్చులు, ఉరులు పెట్టకూడదని, అలా పెడితే వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వారు చెప్పారు. పెద్దపులి దాడిలో చనిపోయిన ఆవు యజమానికి నష్ట పరిహారం చెల్లించనున్నట్లు వారు చెప్పారు.

Leave a Reply