సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె

గాంధీ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించి కార్మికుల నిర‌స‌న‌

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) లోని పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, డ్రైవర్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే నిర‌వ‌ధిక స‌మ్మె త‌ప్ప‌ద‌ని మున్సిప‌ల్ వర్కర్స్ యూనియ‌న్ గౌర‌వ అధ్య‌క్షుడు ఎస్.నాగరాజు హెచ్చ‌రించారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఆందోళన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మహాత్మా గాంధీ విగ్రహానికి మున్సిపల్ కార్మికులు వినతి పత్రాన్ని సమర్పిస్తూ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎస్.నాగరాజు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ఐదు కోట్ల మంది ప్రజలకు అంటు రోగాలు ప్రబలకుండా పరిశుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికుల ( Municipal Workers) ను సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నవంబర్ 3వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో రఘు విజయ గౌరీ కుమారి బాలాజీ రావు మున్సిపల్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వాసు, జయశంకర్, లోకనాథం, వినాయక, సుబ్రహ్మణ్యం ఈశ్వర్, ప్రవీణ్, సుగుణ, సుకన్య, బుల్లెమ్మ, గోవిందస్వామి, బాబు, వినాయకమ్మ కస్తూరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply