IND vs PAK | అరుదైన రికార్డుకు అడుగు దూరంలో కుల్దీప్ యాదవ్ !
టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మైలురాయికి చేరువలో ఉన్నాడు. 300 అంతర్జాతీయ వికెట్లకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఈరోజు పాకిస్థాన్‌తో (ఆదివారం) జరిగే మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీస్తే… అంతర్జాతీయ క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన జాబితాలో చేరుతాడు. అయితే 169 ఇన్నింగ్స్‌ల్లో కుల్దీప్ యాదవ్ ఈ ఫీట్ అందుకోనున్నాడు.
కాగా, 300 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన భారత ఆటగాళ్ల జాబితాలో కుల్దీప్ యాదవ్ 13వ స్థానంలో ఉన్నాడు. ఇక ప్రస్తుతం టీమిండియా యాక్టివ్ బౌలర్లలో మహమ్మద్ షమీ 458 అంతర్జాతీయ వికెట్లతో, రవీంద్ర జడేజా 603 అంతర్జాతీయ వికెట్లతో తీశారు.