- ఇంగ్లాండ్ ఆలౌట్
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు భారత పేసర్లు ముగింపు పలికారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ తన అత్యుత్తమ పేసింగ్ తో మరోసారి మెరిశాడు. డ్రింక్స్ బ్రేక్ అనంతరం కేవలం ఒక్క బంతికే, మహమ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. సాయంత్రం సెషన్‌లో భారతదేశం బలమైన పునరాగమనం చేస్తూ.. ఇంగ్లాండ్‌ను 407 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో భారత్ 180 పరుగుల ఆధిక్యంతో రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.
రోజు ప్రారంభంలోనే రూట్ (22) , స్టోక్స్ (0) లను పెవిలియన్‌కు చేర్చాడు సిరాజ్. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్ (158) – జేమీ స్మిత్ (184 నాటౌట్) భారత బౌలర్లు విసిగిపోయేంతగా, వీరిద్దరూ అద్భుతంగా ఎదురొడ్డి బ్యాటింగ్ చేశారు. 84/5కి ఉన్న ఇంగ్లాండ్ స్కోర్ ను 303 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి, ఇంగ్లాండ్‌ను గట్టెక్కించారు.
చివరికి రెండో న్యూబాల్‌తో ఆట దిశ మారింది. భారత బౌలర్లకు తలనొప్పిగా మారిన బ్రూక్-స్మిత్ జోడీని న్యూబాల్ తీసుకున్న తరువాత ఆకాష్ దీప్ విరగొట్టాడు. హ్యారీ బ్రూక్‌ను ఆకాష్ దీప్ అవుట్ చేయడంతో వారి భారీ భాగస్వామ్యం ముగిసింది.

ఆ తర్వాత వోక్స్‌ను (5) కూడా అవుట్ చేసిన ఆకాష్ దీప్ (4/88) తన టెస్ట్ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఇక మిగిలిన టేయిలెండ్ బ్యాటర్లను రఫ్పాడించిన సిరాజ్ (6/70) ఆరు వికెట్లతో చేలరేగాడు.
ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. స్టంప్స్ ప్రకటించడానికి దాదాపు గంట సమయం ఉంది. ఈ సమయాన్ని ఉపయోగించి త్వరగా పరుగులు సాధించి తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో భారత జట్టు మైదానంలోకి దిగుతుంది.