ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో 4వ రోజు లంచ్ సమయానికి భారత్ దూకుడుగా ముందుకెళ్లింది. రెండో ఇన్నింగ్స్‌లో 38 ఓవర్లలో 177/3తో ఉన్న టీమిండియా ఇప్పటికీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ (41 నాటౌట్) – కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (24 నాటౌట్) ఉన్నారు. వీరిద్దరూ కలిసి కేవలం 53 బంతుల్లో 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈరోజు భారత్ తన ఇన్నింగ్స్‌ను 64/1 వద్ద తిరిగి ప్రారంభించింది. కెఎల్ రాహుల్ (55), కరుణ్ నాయర్ (26) ధీటుగా ఆడుతూ.. పరుగులు సాధించారు.
అయితే, కరుణ్ నాయర్ మరో సువర్ణావకాశాన్ని వదులుకున్నాడు. తన గాయంతో బాధపడుతున్నా చక్కగా బౌలింగ్ చేసిన బ్రైడన్ కార్స్, డ్రింక్స్ బ్రేక్‌కు ముందు కరుణ్ నాయర్‌ను పెవిలియన్ పంపించాడు.
ఇక రాహుల్ తన శైలిలో రన్లు గడిస్తూ 18వ టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ, ఆయన ఇన్నింగ్స్‌ను జోష్ టంగ్ అద్భుతంగా ముగించాడు. మధ్య స్టంప్‌ను ఎగురవేసే బంతితో రాహుల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
రాహుల్ తన శైలిలో పరుగులు రాబడుతూ.. తన 18వ టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, మంచి ఉత్సాహంతో కనిపిస్తున్న రాహుల్‌ను జోష్ టోంగ్ మిడిల్ స్టంప్ మీదుగా క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. శుభమన్ గిల్ తో కలిసి ఆట దిశను మార్చాడు. పంత్ తన ధనాధన్ బ్యాటింగ్ తో వన్డే మ్యాచ్ ఆడినట్లుగా ఆడాడు. సిక్సర్లు, ఫోర్లతో టంగ్, షోయబ్ బషీర్, బెన్ స్టోక్స్ ను వరుస బౌండరీలతో చిత్తు చేశాడు. ఈ దూకుడుతో భారత్ 357 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.