IND vs ENG | లంచ్ తర్వాత ఊపందుకున్న ఇంగ్లాండ్..

ఓవల్ | లంచ్ బ్రేక్ అనంతరం ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో పూర్తిగా పెనుగులుబాటు కనిపించింది. జో రూట్ – హ్యారీ బ్రుక్ జంట భారత బౌలర్లను నిల‌క‌డ‌గా ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తున్నారు.

19 పరుగుల వద్ద బ్రూక్, ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో ఒక క్యాచ్ ఇవ్వగా, సిరాజ్ బౌండరీ వద్ద క్యాచ్ పట్టినా లైన్ దాటి వెళ్లడం వల్ల అది లైఫ్‌గా మారింది. అలా తప్పించుకున్న‌ బ్రూక్.. భారత జట్టుకు త‌లనొప్పిగా మారాడు. కేవలం 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ప్రస్తుతం శతక దిశగా పరుగులు పెడుతున్నాడు.

హ్యారీ బ్రూక్‌కు తోడుగా జో రూట్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అతను 81 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసి దూకుడు కొనసాగించాడు. ఈ ద్వయం భాగస్వామ్యం భారత్ ఆశల్ని మసకబారుస్తోంది. ప్రస్తుత భాగస్వామ్యం భారత్ టెస్టు సిరీస్ ఆశలకు తీవ్రమైన సవాల్ విసురుతోంది.

ప్రస్తుతం ఇంగ్లాండ్ 58 ఓవర్లలో 270/3తో ఉంది, బ్రూక్ – 92 (83), రూట్ – 71 (113) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంకా 104 పరుగులు అవసరం, భారత్ కు ఇంకా ఏడు వికెట్లు అవసరం.

Leave a Reply