IND vs ENG 4th Test | భారత్ ఆలౌట్.. బెన్ స్టోక్స్ అద్భుత ఫైఫర్ !

మాంచెస్ట‌ర్ : ఇంగ్లాండ్ తో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదిక‌గా జరుగుతున్న కీల‌క‌ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుండి నడిపిస్తూ అద్భుతంగా ఐదు వికెట్లు పడగొట్టి భారత్ ను 358 పరుగులకే కట్టేశారు. 400 పరుగుల మైలురాయిని దాటుదామనుకున్న భారత్ చివరి ఐదు వికెట్లను కేవలం 44 పరుగులకే కోల్పోయి కొంచెం నిరాశకు లోనయ్యింది.

మాంచెస్ట‌ర్ : ఇంగ్లాండ్ తో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదిక‌గా జరుగుతున్న కీల‌క‌ నాలుగో టెస్టులో భారత్ ను 358 పరుగుల‌కు ఆలౌట్ అయ్యింది. అయితే, 400 పరుగుల మైలురాయిని దాటుదామనుకున్న భారత్ చివరి ఐదు వికెట్లను కేవలం 44 పరుగులకే కోల్పోయి కొంచెం నిరాశకు లోనయ్యింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుండి నడిపిస్తూ ఐదు వికెట్లు అద్భుత ఫైఫ‌ర్ సాధించాడు.

భార‌త ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46) ప్రారంభంలో భార‌త్ ఆన్నింగ్స్ కు మంచి పునాది వేసారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (12) త్వరగా అవుట్ అవ్వ‌గా.. బి సాయి సుధర్శన్ (61) నంబర్ 3లో హాఫ్ సెంచరీతో రాణించాడు.

రిషబ్ పంత్ గాయంతోనూ (ఫుట్ ఫ్రాక్చర్) ధైర్యంగా బ్యాటింగ్ కొనసాగించి 75 బంతుల్లో విలువైన 54 పరుగులు సాధించాడు. దీంతో పంత్ రెండు కీలక రికార్డులు తిరగరాసాడు. ఇంగ్లండ్‌లో టెస్టుల్లో వికెట్‌ కీపర్‌గా ఎక్కువ సార్లు (9) 50+ స్కోర్లు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు పంత్ నిలిచాడు. ఇదివ‌ర‌కు ఈ రికార్డ్ ఎంఎస్ ధోనికి పేరిట (8) ఉండేది.

అదేవిధంగా, ఒకే టెస్టు సిరీస్‌లో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన భారత వికెట్ కీపర్‌గా పంత్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 5 హాఫ్ సెంచరీలు సాధించిన పంత్.. దిగ్గ‌జ ప్లేయ‌ర్లు ఫారుక్ ఇంజనియర్ (4), ధోని (4) రికార్డును అధిగమించాడు.

ఇక‌, షార్దూల్ ఠాకూర్ దూకుడుగా 41 పరుగులు చేసి ఆక‌ట్టుకున్నాడు. వాషింగ్ట‌న్ సుందర్ (27) కుదురుగా ఆడగా, స్టోక్స్ ఒక్క ఓవర్‌లోనే సుందర్, అంషుల్ కాంబోజ్ (0) ను అవుట్ చేసి తన ఫైఫర్‌ను పూర్తిచేశాడు. స్టోక్స్ 5/72 తో ఎనిమిదేళ్ల తర్వాత తన కెరీర్‌లో మళ్లీ ఐదు వికెట్లు పడగొట్టాడు.

చివరగా పంత్ ను జోఫ్రా ఆర్చర్ (3/73) బోల్తా కొట్టించాడు. క్రిస్ వోక్స్ (1/66), లియామ్ డాసన్ (1/45) ఒక్కో వికెట్ సాధించారు.

Leave a Reply