IND vs AUS | చ‌రిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్ !

భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. వన్డేల్లో వేగంగా 3,000 పరుగులు పూర్తి చేసిన మూడో భారతీయుడిగా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు. దుబాయ్ వేదిక‌గా ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్‌లో 42 ప‌రుగులు సాధించి నాటౌట్ గా నిలిచి కేఎల్…. ఈ ఘనత సాధించాడు.

78 ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 84 మ్యాచుల్లో 3009 ప‌రుగులు సాధించాడు. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్ (72), విరాట్ కోహ్లీ (75) మాత్రమే ఈ మైలురాయిని వేగంగా చేరుకున్నారు. అయితే శిఖర్ ధావన్, కోహ్లిలు ఓపెన‌ర్ బ్యాట్స్‌మెన్‌లుగా ఈ ఘనత సాధించగా, కేఎల్ రాహుల్ ఈ రికార్డును మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా చేరుకోవ‌డం వివేశం.

Leave a Reply