శ్రీపాద సాగర్ కి పెరిగిన ఇన్‌ఫ్లో..

గోదావరిఖని, ఆంధ్ర‌ప్ర‌భ : శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తాకిడి గంట గంటకు పెరుగుతూ వస్తుంది. ఈ రోజు సాయంత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 6 లక్షల 79 వేల 709 క్యూసెక్కుల నీరు చేరుతోంది. అర్ధరాత్రి వరకు ఎనిమిది లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు 43 గేట్లను ఎత్తి 6,84,720 క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే పార్వ‌తీ బ్యారేజ్ కి సంబంధించిన మొత్తం 74 గేట్లను ఎత్తి దిగువకు 6,01,825 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు.

ఇన్ ఫ్లో : 6,79,709 క్యూసెక్కుల నీరు
అవుట్ ఫ్లో : 6,79,285 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం : 148 (మీటర్లు)
ప్రస్తుత నీటి మట్టం : 146.21 (మీటర్లు)
పూర్తి స్థాయి నీటి నిల్వలు: 20.175 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వలు : 15.4031 టీఎంసీలు
మొత్తం గేట్లు : 64
ఎత్తిన గేట్లు : 43

నీటి విడుదల….
హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై : 303 క్యూసెక్కులు
రామగుండం ఎన్టిపిసి ప్రాజెక్ట్ : 121 క్యూసెక్కులు

పార్వతి బ్యారేజ్ నీటి వివ‌రాలు

ఇన్ ఫ్లో : 6,01,825 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 6,01,825 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం : 130 మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం : 123.90 మీటర్లు
బ్యారేజీ నీటి సామర్థ్యం : 8.83 టీఎంసీలు

Leave a Reply