Inclusion | అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరిక

Inclusion | అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరిక
- బీజేపీ రాష్ట్ర నాయకుడు వడ్డీ మోహన్ రెడ్డి
Inclusion | రెంజల్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రానికి చెందిన 3,5,7 వార్డు సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గొట్టిముక్కుల లలిత, ఇస్తిరి పద్మ, జమేదార్ రమ్య ఉప సర్పంచ్ శీలం మానస రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకుడు సుక్క రాజు గౌడ్ నేతృత్వంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి బీజేపీ పార్టీని ఆదరిస్తున్నారని చెప్పారు. తమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బా కొడుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ వార్డు సభ్యులు తమ్మలి సంతోష్, గోరుబాగు శ్రీనివాస్, బోయిరాజు, శీలం రాకేష్ రెడ్డి, జమీందార్ రాము, గొట్టుముక్కుల మనోజ్, వినోద్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
