Murder | భర్తను కడతేర్చిన భార్య

Murder | భర్తను కడతేర్చిన భార్య

Murder | మల్లాపూర్, ఆంధ్రప్రభ: కట్టుకున్న భర్తను భార్యే హతమార్చిన సంఘటన మల్లాపూర్ (Mallapur) మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా (Jagtial District) మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన పల్లికొండ మల్లయ్య (Mallaiah)ను (52) అయన భార్య కత్తితో కోసి అత్యంత దారుణంగా హతమార్చారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా భర్తను సొంత భార్యే హత్య చేయడంపై పోలీసులు పూర్తి వివరాలు తెలపాల్సి ఉంది.

Leave a Reply