23న‌ శ్రీ కోదండ రామా పిరమిడ్ ధ్యానమందిరం ప్రారంభోత్సవం

23న‌ శ్రీ కోదండ రామా పిరమిడ్ ధ్యానమందిరం ప్రారంభోత్సవం

రూ 60 లక్షలతో నిర్మించిన శింగంశెట్టి గురునాథ్

తుగ్గలి అక్టోబర్21 (ఆంధ్రప్రభ) : మండలం పరిధిలోనే ఉప్పర్లపల్లె గ్రామ సమీపంలోనే బోడబండ తిమ్మగురుడు, పకీరప్ప స్వాముల ఆలయాల వద్ద నిర్మించిన శ్రీ కోదండ రామ పిరమిడ్ ధ్యాన మందిరమును ఈ నెల 23న 111 సంవత్సరాల హిమాలయ యోగేశ్వరులు సదానందగిరి మహారాజ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఉప్పర్ల పల్లె గ్రామానికి చెందిన అచ్చమ్మ, పుల్లయ్య దంపతుల కుమారుడు సింగంశెట్టి గురునాథ్ రూ 60 లక్షల సొంత డబ్బులతో బోడబండ లోనే ధ్యాన మందిరం నిర్మించారు. సింగంశెట్టి గురునాథ్ హైదరాబాదులో ని ఏజీ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేశారు. దీంతో తనకు జన్మనిచ్చిన గ్రామమైన ఉప్పర్లపల్లె గ్రామ ప్రజలకు భక్తి భావాలు పెంపొందించేందుకు ధ్యాన మందిరము నిర్మించారు. గత సంవత్సర క్రితం ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఈ నెల 23వ తేదీన ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు. బోడబండ పకీరప్ప స్వామి ఆలయ ధర్మకర్త, ఉప్పర్లపల్లె సొసైటీ అధ్యక్షులు అప్పా వేణుగోపాల్, నిర్వాహకులు అప్పా ప్రభాకర్ లు ప్రారంభోత్స‌వ ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply