ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
బెజ్జంకి, ఆంధ్రప్రభ : రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, దళారులను ఆశ్రయించొద్దని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Kavvampally Satyanarayana) రైతులను కోరారు. ఈ రోజు తోటపల్లి, ముత్తన్నపేట, కళ్లేపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ అందిస్తుందని, రైతులు దీనిని వినియోగించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ తన్నీరు శరత్ రావు(Tanniru Sarath Rao), మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ , మండలపార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి(Mukkisa Ratnakar Reddy), మాజీ ఎంపిపి ఒగ్గు దామోదర్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.