జగన్మాత సన్నిధిలో..

జగన్మాత సన్నిధిలో..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలో నిర్వహించిన శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన పూజలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Leave a Reply