కుటుంబ స‌భ్యుల పేరున…

కుటుంబ స‌భ్యుల పేరున…

బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని భగీరథ పల్లి గ్రామంలో సొంత డబ్బులతో శివాలయం నిర్మించడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran Reddy) అన్నారు. గ్రామానికి చెందిన పల్లెర్ల అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు గ్రామంలో వారి కుటుంబ సభ్యుల పేరున శివాలయాన్ని నిర్మించారు.

ఈ సందర్భంగా ఈ రోజు ఆలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు(special pujas) నిర్వహించారు. ఆలయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించి ఆలయంలో పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఆలయం నిర్మించిన దంపతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు శివుని ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

కార్తీక మాసం(Kartika month)లో శివుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పారు. ఆయనతోపాటు ఎస్సై ఆంజనేయులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మాణ కర్త అశోక్ శాలువాలతో సత్కరించి అభినందించారు.

Leave a Reply