స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్రలో..
- పక్కా ఇళ్లు లేవు
- వర్షం వస్తే తడవాల్సిందే
- కూలీనాలీ పని లేదు
- స్మశానానికి దారి లేదు
- తాగటానికి నీరు దొరకదు
- బడి అంతంతే..
- ఇదీ అనుపు ఎస్టీల గోస
- చిత్తూరు కలెక్టర్‌కు సరికొత్త అనుభూతి
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : పక్కా ఇళ్లు లేవు, వర్షం వస్తే తడవాల్సిందే, కూలీనాలీ పని లేదు, స్మశానానికి దారి లేదు, తాగటానికి నీరు దొరకదు, ఇక బడి సంగతి సరేసరి.. ఇదీ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌కు(Collector Sumit Kumar) ఓ గిరిజన కాలనీవాసులు వినిపించిన గోస. శనివారం చిత్తూరు నియోజకవర్గం గుడిపాల పంచాయతీ(Gudipala Panchayat) పరిధిలోని అనుపు ఎస్టీ కాలనీ నందు జిల్లా కలెక్టర్ స్వర్ణాంధ్ర – స్వచ్ఛఆంధ్ర(Swarnandhra – SwachhAndhra) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యతో మెరుగైన జీవన విధానం పొందవచ్చని, ప్రతి గిరిజన కుటుంబంలోని పిల్లలందరినీ బడికి పంపించి చదివించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, పర్యావరణాన్నికాపాడుకుందాం, భావితరాల వారికి స్వచ్ఛమైన పర్యావరణా(Environment)న్నిఅందిద్దాం అని తెలిపారు.
అనంతరం మండల స్థాయి అధికారులతో కలసి ఎస్టీ కాలనీలోని గుడి సమీపంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామసభ(Gram Sabha)లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల స్థితిగతులు మారాలంటే పిల్లలను ఖచ్చితంగా బడికి పంపి చదివించాలన్నారు. విద్యతోనే ఉపాధి పొంది తమను తాము పోషించుకోగల స్థితి వస్తుందన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుకొని గిరిజను(Tribal)లు అభివృద్ధి చెందాలన్నారు.
ప్రభుత్వం గిరిజనులకు విద్య, వైద్యం అందింస్తుందని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాలనీ వాసులు తమకు పక్కా ఇల్లు(Pucca House) లేవని, ఉన్నఇళ్లు వర్షం వస్తే నీరు కారుతుందని తమకు పక్కా గృహాలు కావాలని కోరగా రెండు వారాలలో చర్యలు చేపట్టాలని తహసీల్దార్ ను ఆదేశించారు. శ్మశానానికి వెళ్లాలంటే ప్రైవేట్(Private) వ్యక్తుల భూమి గుండా వెళ్తున్నామని, ఉండగా సమస్యగా ఉందని దారి సమస్య తీర్చాలని గిరిజనులు కోరారు.
దారి సమస్య తీర్చడానికి త్వరలో మండల సరే బృందాన్నికాలనీకి పంపిస్తామని తాహసీల్దార్ హామీ ఇచ్చారు. తమిళనాడు నుండి కొంత మంది వలస రావడంతో కనీసం ఆధార్ కార్డులు(Aadhaar Cards) కూడా లేవని తెలిపారు. వెంటనే ఆధార్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలో ఆధార్ కార్డుల కార్యక్రమాన్నినిర్వహిస్తామని తెలిపారు. చదువుకున్నయువతకు అమరరాజా ఫ్యాక్టరీలో శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆడ పిల్లలు కంప్యూటరు విద్యకు సంబంధించి నైపుణ్య శిక్షణ పొందాలని అందుకు అవసరమైన నిధులు(Funds) మంజూరు చేస్తానన్నారు.
వీరికి అవకాశాన్ని బట్టి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కాలనీలో దాదాపు 46 ఇళ్లు ఉన్నాయని ఓవర్ హెడ్ ట్యాంక్ మంజూరు చేయాలని కోరగా, ప్రస్తుతం ఒక సిన్టెక్స్ ట్యాంక్(Syntex Tank) ఉందని, ఇందుకు అదనంగా రెండు ట్యాంకు లను ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రం ప్రైవేట్ గదులలో ఉన్నదని, నూతనంగా ప్రభుత్వ అంగన్వాడీ భవనం నిర్మించాలని కోరగా, ప్రస్తుతం అంగన్వాడీ(Anganwadi) కేంద్రంలో కేవలం ఐదుగురు పిల్లలు ఉన్నారని, ఇప్పుడు ఉన్నభవనాన్నిపునరుద్ధరించి ఇస్తామన్నారు.
నూతనంగా వివాహం అయిన దంపతులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఒంటరి మహిళ, వితంతు పెన్షన్(Widow Pension) మంజూరు చేయాలని స్థానికులు కలెక్టర్ ను కోరారు. కాలనీ వాసులు కోరిన అభ్యర్థనలను సావదానంగా విన్నకలెక్టర్ కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించి మరికొన్నింటిని పరిశీలించి చర్యలు చేపడుతామన్నారు. ఈ పర్యటనలో గుడిపాల మండల తహశీల్దార్ శ్రీనివాస్, ఎం పి డి ఓ కుమార్, డ్వామా ఏ పి డి సుబ్రమణ్యం, ఎంఈఓ, పోలీస్, వైద్య, విద్యుత్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు పాల్గొన్నారు.

