బాలల రక్షణే లక్ష్యం

బాలల సంరక్షణ చట్టాల పునశ్చరణ తరగతుల్లో
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
( ఒంగోలు క్రైమ్, ఆంధ్రప్రభ)
బాలల సంరక్షణలో పోలీసు శాఖ ఎల్లవేళలా ముందు ఉంటుందని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు అన్నారు. పిల్లల రక్షణ ( Child protection ) కోసం రూపొందించిన చట్టాలపై పోలీస్ అధికారులు మెరుగైన అవగాహన పెంచుకోవాలన్నారు. బాల్య న్యాయ చట్టం ( Child Justice Act) , పోక్సో (Pocso act) చట్టం, పిల్లలకు ఇతర చట్టాలపై అవగాహన పెంచేందుకు బాలల సంక్షేమ పోలీస్ అధికారులు, మహిళా సహాయక కేంద్రం సిబ్బంది, శక్తి టీమ్స్, జిల్లా AHTU బృందంతో ఒంగోలులోని జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో పునశ్చ రణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, పోక్సో చట్టం, జువెనైల్ (juvinel justice) జస్టిస్ యాక్ట్–2015, బాల్య వివాహాల నిర్మూలన (Child marrages Prevention) , బాలల సంరక్షణ వంటి కీలక చట్టాలపై పోలీస్ సిబ్బంది మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో ఈ చట్టాల ప్రకారం పాటించాల్సిన నియమాలను తెలుసుకోవడం, ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో నేరాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. బాధిత బాలబాలికలకు న్యాయం చేయడంలో చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు బస్టాండులు, ఆర్టీసీ కాంప్లెక్సులు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్ళు, ఈవ్ టీజింగ్ (eve teseaing) జరిగే ప్రదేశాలు, పాఠశాలలు, కళాశాలల వద్ద పర్యటిస్తూ ఏ సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించే విధంగా పని చేయాలని ఎస్పీ సూచించారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం శక్తి యాప్ ప్రాముఖ్యత, ( Shakti app) అందించే సేవల గురించి విస్తృత అవగాహన కల్పించాలని, ఎణ్ ఫోర్స్ మెంట్ నిర్వహించాలన్నారు. శక్తి కాల్స్, డయల్ 100/112, ఉమెన్ హెల్ప్ లైన్ (Women Help Line) -181 ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత పోలీసులు చురుకుగా స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.
శక్తి టీమ్ ఏర్పాటు చేసినప్పుడు నుంచి 3000 పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, 813 SOS కాల్స్ కు వెంటనే స్పందించినట్టు వివరించారు. ఇంకా ఎక్కువ డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తూ స్కూల్/కాలేజీ ల వద్ద విజిబుల్ పోలీసింగ్ చేస్తూ శక్తి యాప్ గురించి తెలియచేస్తూ ఎక్కువగా అవగాహనా కల్పిస్తూ మహిళలు , చిన్నపిల్లలు (women, chidren) జరిగే నేరాలను నివారించడంలో కృషి చేయాలని సూచించారు. రెస్పాన్స్ టైమ్ (response time) అత్యంత కీలకమన్నారు. బాధితులకు అండగా నిలిచి, సమాజం గుర్తుంచుకునే విధంగా విధులు నిర్వర్తించాలని పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమంలో ICDS పిడి. ఎస్.సువర్ణ, CDPO పి.ఇవాజింలెన్, DCPO పి.దినేష్, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వి.వి. రమణ కుమార్, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ యూ.సుధాకర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, ICDS సిబ్బంది పాల్గొన్నారు.
