మేడారంలో.. ఆ నలుగురు..
తాడ్వాయి, ఆంధ్రప్రభ – ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నేడు నలుగురు మంత్రులు (Ministers) పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ పర్యటించనున్నారు. ఈ సందర్బంగా మేడారంలో (Medaram) జరుగుతున్నఅభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. అనంతరం పలు శాఖల అధికారులతో పనుల పురోగతి పై సమీక్షా సమావేశం నిర్వహించన్నునారు. మేడారం మహా జాతర ఇంకా 77 రోజులే ఉండడంతో పనులు త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులను, కాంట్రాక్ట్రర్లను పనులు స్పీడప్ చేయాలనీ ఆదేశించనున్నారు.

