Collector | రైతు సంక్షేమానికి ప‌థ‌కాల అమ‌లు

Collector | రైతు సంక్షేమానికి ప‌థ‌కాల అమ‌లు

వ్యవసాయం పండుగ చేసేందుకు ప్రభుత్వం కృషి
చెరువులకు మరమ్మతులు.. రైతుల కళ్ళల్లో ఆనందం
జిల్లా కలెక్టర్ రాజ‌కుమారి ధోని, ఎమ్మెల్యే కోట్ల జ‌య సూర్య ప్ర‌కాశ్ రెడ్డి

Collector | డోన్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసమే అనేక పథకాలు రూపొందిస్తుందని, ఇందులో భాగంగానే రైతన్న నీకోసం కార్యక్రమంలో పంచ సూత్రాల అమలులో భాగంగా వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కలెక్టర్ (Collector) రాజకుమారి ధోని, ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. ఈ రోజు డోన్ నియోజకవర్గంలోని పలు చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులకు మరమ్మతులు చేపడుతామన్నారు. డోన్ మండల పరిధిలోని అబ్బిరెడ్డిపల్లి చెరువును పరిశీలించి జల హారతి చేశారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ… డోన్ నియోజకవర్గంలో ప్రతీ ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. గోరుకల్లు రిజర్వాయర్ (Gorukallu Reservoir) నుండి బేతంచెర్ల వరకు నీరు వస్తుందన్నారు. డోను ప్యాపిలి మండలాల్లోని అన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలను, రైతుల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. నియోజకవర్గంలో ఉన్న 68 చెరువులను నీటితో నింపి వాటి ద్వారా పంట పొలాల‌కు అందిస్తామ‌న్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, అబ్బిరెడ్డిపల్లె చెరువు చైర్మన్ శ్రీనివాసులు, టీడీపీ మండల అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి, పట్టణ అధ్యక్షులు టీ.రాఘవేంద్ర గౌడ్, వెంకటాపురం మాజీ చైర్మన్ చంద్రుడు, పెద్దయ్య, అబిరెడ్డిపల్లె శ్రీనివాస్ గౌడ్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply