వెంటనే సహాయం చేయాలి…
చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా(Nalgonda District) చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామ శివారులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఐదు రోజులుగా పిల్లాయి కాలువకు గండి పడడంతో పంటచేలకు భారీగా వర్షపు నీరు చేరుతోంది. వరి పొలాలు పూర్తిగా మునిగి పోయి రైతులు ఆందోళనలో ఉన్నారు.
బాధిత రైతులు పలుమార్లు అధికారుల(officials)ను సంప్రదించినా, ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. కాలువ గండి మూసివేయాలని, పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే సహాయం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

