అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..

శివ్వంపేట, ఆంధ్రప్రభ : మండలంలోని ఉసిరికపల్లి చౌరస్తాలో, మండల ఫ్లైయింగ్ స్వాడ్ టీమ్ డిప్యూటీ తహసీల్దార్ షఫీయొద్దిన్ ఆధ్వర్యంలో ఎన్నికల విధులలో భాగంగా శుక్రవారం రాత్రి తనిఖీలు జరిపి, అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం చేసుకున్నారు.

ఫ్లైయింగ్ స్వాడ్ టీమ్ షఫీయొద్దిన్ వివరాల ప్రకారం, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో కలిసి నర్సాపూర్-తూప్రాన్ ప్రధాన రహదారిపై ఉసిరికపల్లి బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా, ఉసిరికపల్లి గ్రామానికి చెందిన గిద్దె శ్రీనివాస్ అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం అయ్యింది.

శ్రీనివాస్ నుండి 48 బీరు బాటిల్లు, 50 క్వార్టర్ మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకుని, పంచనామా నమోదు చేసి, వాహనం మరియు మద్యం పోలీస్‌కి అప్పగించబడింది. ఆయనపై కేసు నమోదు చేయబడినట్లు తెలిపారు.

ఫ్లైయింగ్ స్వాడ్ అధికారులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మద్యం మరియు డబ్బులు తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల గిర్థవర్ నిరంజన్, పోలీసులు మరియు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply