అక్రమంగా పశువులు తరలింపు..

అక్రమంగా పశువులు తరలింపు..

జైనూర్, ఆంధ్రప్రభః పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో నిర్వహించిన పశువుల సంత నుండి ఐచర్ వాహనంలో అక్రమంగా క్రూరంగా వాహనంలో తాడులతో కట్టి తరలిస్తున్న 23 పశువులను పట్టుకున్నట్లు జైనూర్ ఎస్సై రవికుమార్ తెలిపారు. మండలంలోని జంగాం సమీప శివారు ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వాహనంలో ఇరుకుగా పశువులను ఎలాంటి మేత, నీరు లేకుండా క్రూరంగా తరలిస్తున్న విషయం గమనించి తనిఖీలు చేయగా ఈ విషయం బయటపడిందని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను విచారించగా జైనూర్ పశువుల సంత నుండి తీసుకు వెళుతున్నట్లు తెలిపారని ఎస్ఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.

Leave a Reply