అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత

ట్రాక్టర్ యజమాని, డ్రైవర్ పై కేసు నమోదు….

రేగొండ, ఆంధ్రప్రభ: రేగొండ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు రేగొండ ఎస్సై. సుధాకర్ తెలిపారు.టేకుమట్ల మండలానికి చెందిన ట్రాక్టర్ యజమాని పెసరు విగ్నేష్, ట్రాక్టర్ డ్రైవర్ ఉడత అనిల్ అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తూ ఉండగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇలాంటి అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, సరైన అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తే తప్పనిసరిగా కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు.ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాల గురించి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Leave a Reply