అక్రమ అరెస్టులతో ఆపలేరు..

అక్రమ అరెస్టులతో ఆపలేరు..
చిట్యాల, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాల అమలు చెయ్యాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేడు సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చారు. ఈ నేపధ్యంలో ముందస్తుగా చిట్యాల పోలీసులు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 6 గ్యారంటీలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయగా, అర్ధరాత్రి సమయాల్లో బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం తగదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో మమ్మల్ని ఆపలేరు అన్నారు. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ నేతలు జిల్లా ఉపాధ్యక్షుడు గోపాలపురం సర్పంచ్ గొర్రె శేషి కుమార్, గుండ సురేష్, రాయిని శ్రీనివాస్, సాద సదానందం, కేంసారపు ప్రభాకర్, వల్లల ప్రవీణ్ లు ఉన్నారు.
