Illandula | హ్యాట్రిక్ విజయం

Illandula | హ్యాట్రిక్ విజయం

  • 218 ఓట్ల భారీ మెజారిటీ
  • వార్డు ప్రజలకు రుణపడి ఉంటాం
  • ఎమ్మెల్యే సహకారంతోనే గెలుపు

Illandula | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో 29వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇల్లందుల రజనీకృష్టమూర్తి హ్యాట్రిక్ విజయం సాధించారు. శుక్రవారం జరిగిన కౌంటింగ్ లో 218 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మూడు పర్యాయాలుగా ఇల్లందుల రజని కృష్ణమూర్తిలు విజయం సాధించడం విశేషం. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించగా మరోసారి బిఆర్ఎస్ నుండి పోటీ చేసి విజయం సాధించారు.

ఎమ్మెల్యే సహకారంతోనే గెలుపు

Illandula

పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో ఈరోజు ఘన విజయం సాధించామని 29వ వార్డు కౌన్సిలర్ గెలుపొందిన ఇల్లందుల రజని కృష్ణమూర్తి లు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అందించడంతోపాటు వార్డులో ప్రచారం చేసి తమ గెలుపులో కీలకపాత్ర పోషించారన్నారు. గత రెండేళ్లుగా పట్టణంలో ఎమ్మెల్యే చేసిన కృషి తమకు మంచి ఫలితాన్ని అందజేసింది.

వార్డు ప్రజలకు రుణపడి ఉంటాం

గత మూడు పర్యాయాలుగా తమను గెలిపిస్తున్న 29వ వార్డు ప్రజలకు తుది శ్వాస విడిచే వరకు రుణపడి ఉంటామని కౌన్సిలర్ గా గెలుపొందిన ఇల్లందుల రజని కృష్ణమూర్తి తెలియజేశారు. ప్రతిసారి తమను గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తున్నారని, వారి రుణం ఏమిచ్చిన తీర్చుకోలేనిది అన్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండి వార్డు ప్రజలకు సేవలు అందిస్తామన్నారు. తమ గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

Leave a Reply