63 కేసుల్లో దొరికిన రూ.4.40 లక్షల లిక్కర్
(ఆంధ్ర ప్రభ, కోసిగి ( కర్నూలు జిల్లా)
కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో దొరికిన 804 లీటర్ల అక్రమ మద్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు. కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ భార్గవ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 63 కేసుల్లో 804 లీటర్ల అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల అధికారుల ఆదేశాల మేరకు ఈ అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. ఈ అక్రమ మద్యం విలువ రూ. 4.40 లక్షలు ఉంటుంది. ఈ కార్యక్రమంలో కోసిగి ఎస్సై హనుమంత రెడ్డి, కోసిగి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

